యువనేత సారిపిల్లి సంతోష్ యాదవ్ రాజకీయంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు
వై యస్ ఆర్ సి పి నాయకులు
విశాఖపట్నం (అక్షర ప్రళయం)
యువనేత సారిపిల్లి సంతోష్ యాదవ్ రాజకీయంగా ఉన్నత స్థితికి చేరుకుంటాడని వైసిపి ఉత్తర నియోజకవర్గం ఇంచార్జ్ కేకే రాజు, వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి చొక్కాకుల వెంకటరావు అన్నారు.శనివారం జీవీఎంసీ 25 వ వార్డులో సారిపిల్లి సంతోష్ జన్మదిన వేడుకలు మిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ముఖ్య అతిధులుగా హాజరైన కేకే రాజు,చొక్కాకుల వెంకటరావు లు సన్నిహితుల కేరింతల మధ్య సంతోష్ తో కేక్ కట్ చేయించి జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం తన పుట్టినరోజు సందర్భంగా సుమారు 300 మంది పేద మహిళలకు అతిధుల చేతుల మీదుగా చీరలు,పళ్ళు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మిత్ర బృందం సంతోష్ దంపతులను గజమాలతో సత్కరించి,సన్మానపత్రం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అతిధులు మాట్లాడుతూ అందరితో ఆత్మీయంగా మెలుగుతూ అంకిత భావంతో సమాజ సేవ చేస్తున్న సంతోష్ కు ఉజ్వల భవిష్యత్తు ఉందని వ్యాఖ్యానించారు.ఈ వేడుకల్లో సీఐ గొంప దివాకర్ యాదవ్,వార్డ్ కార్పొరేటర్ సారిపిల్లి గోవింద్, సానబోయిన సురేష్,బోర శ్రీనివాస్,భీమవరపు శ్రీనివాస్,సారిపిల్లి గంగరాజు,బోర వెంకటరమణ, వారాధి శ్రీను,నమ్మి వెంకట్, ముద్దాడ కొండబాబు, బోర గోవింద్, బోగవిల్లి గోవింద్, ఏదిరి వెంకటరమణ,శివ గణేష్ శర్మ,తొత్తాడ రవి, వీయ్యపు సంతోష్, ముద్దాడ శ్యామ్, ఇసరపు అప్పలరాజు, సారిపిల్లి వేణు అధిక సంఖ్యలో స్థానిక యువత,అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొని సంతోష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.*