లక్ష 50 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏ.సి.బి అధికారులు..!
ఒంగోలు (అక్షర ప్రళయం)
ఒంగోల్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్, కేఎస్ శ్రీనివాస ప్రసాద్ పనిచేస్తున్నరు ఫిర్యాది సిహెచ్ శ్రీధర్ ట్రేడ్ కంపెనీకి నోటీసు ఇచ్చి దానిపై ఫిర్యాదికి పెన్నాలిటీ వేసినందున ఆ పెనాల్టీ లేకుండా చేయుటకు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ లక్ష యాభై వేలు రూపాయలు లంచం డిమాండ్ చేసి సదరు లంచం తీసుకుంటుండగా ఒంగోలు ఎసిబి డిఎస్పి రెడ్ హ్యాండుగా పట్టుకొని అతని వద్ద నుండి లక్ష యాభై వేలు రూపాయలు లంచం డబ్బులు రికవరీ చేసినారు. ఏసీబీ డీఎస్పీ పి రామచంద్ర రావు, ఇన్స్పెక్టర్ శ్రీ శేషు, ఎస్ఐ లు జే.బీ.ఎన్ ప్రసాద్, షేక్.మస్తాన్ షరీఫ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.