10వేలు ఫైన్ వేసిన 1టౌన్ ట్రాఫిక్ సి. ఐ..!
పూర్ణ మార్కెట్ (అక్షర ప్రళయం)
విశాఖపట్నం ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, వాహన చోదకులు ట్రాఫిక్ నియమాలు తప్పక పాటించాలని 1టౌన్ ట్రాఫిక్ సి.ఐ తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ రావు , ఎస్ ఐ విశ్వనాథం పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ గుడి దగ్గర రోజు వారి డ్యూటీ లో బాగంగా వెహికల్స్ ను చెక్ చేస్తూ ..చలానా రాస్తుండగా ..20 మంది స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఒక ఆటో డ్రైవర్ని వన్ టౌన్ ట్రాఫిక్ సిబ్బంది పట్టుకొని పదివేల రూపాయలు ఫైన్ వేశారు. ఆటో వాళ్ళు స్కూల్ పిల్లల్ని తీసుకు వచ్చినప్పుడు జాగ్రత్తలు వహించాలి. ఆటో డ్రైవర్లు ఓవర్ లోడ్ ఎక్కించరాదని కోరారు. ఈ కార్యక్రమం లో ట్రాఫిక్ ఎస్ఐ విశ్వనాధ్, హోంగార్డ్ ఉదయ్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.