నర్సీపట్నం (అక్షర ప్రళయం)
నర్సీపట్నం జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్. రేవతమ్మ ఆధ్వర్యంలో నర్సీపట్నం రూరల్ ఎస్సై పి.రాజారావు, సిబ్బంది బుధవారం నర్సీపట్నం మండలం చెట్టుపల్లి, రోలుగుంట మండలం సరిహద్దులో నాటు సారా తయారీకి సంబంధించిన స్థావరాలపై నమ్మకమైన సమాచారంతో మెరుపు దాడి చేశారు. ఈ సందర్భంగా నాటు సారా తయారీకి ఉపయోగించే పులుపు సుమారు 4000 లీటర్లను ధ్వంసం చేయడం జరిగింది. అదే విధంగా నాటు సారా తయారీకి ఉపయోగించే సామగ్రిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అనంతరం సీఐ రేవతమ్మ మాట్లాడుతూ ఎక్కడైనా నాటుసారా తయారీ గాని అమ్మకాలు గాని, అక్రమంగా మద్యం అమ్మకాలు జరిగినట్లు అయితే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని కోరారు.