న్యూస్ డెస్క్ (అక్షర ప్రళయం)
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైద్య ఆరోగ్యంకు పెద్ద పేట వేసిందని అన్నారు. దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి సీతంరాజు సుధాకర్ ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశాఖ చైర్మన్ గా శుక్రవారం మంగళగిరిలోని ఎన్టీఆర్ వైద్య సేవ కార్యాలయంలో కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకంకు బకాయిపడ్డ నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేస్తున్నారని ఇందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు.ఆరోగ్యశ్రీ తో పాటు 108,104 వాహనాల సక్రమ నిర్వహణకు గట్టి కృషి చేస్తామన్నారు. నిరుపేదలకు ఈ పథకం మరింత చెరువు చేస్తామని ముఖ్యమంత్రి,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో వైద్య ఆరోగ్యంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని ప్రజల ఆరోగ్యం మెరుగుపడాలన్నదే తమ ఉద్దేశమని సుధాకర్ తెలిపారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీభరత్, ఏపీ సి ఓ డి ఎఫ్ ఎల్ చైర్మన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, బండారు సత్యనారాయణ మూర్తి విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.