యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి
యానాం (అక్షర ప్రళయం)
యానాం అక్షర ప్రళయం, యానాం ప్రివిలేజ్ కమిటీ కి ఫిర్యాదు చేసినా అధికారుల తీరు మారడం లేదని… యానాం లో తప్ప పుదుచ్చేరిలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో మల్లాడి పేరు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించిన? గొల్లపల్లి,ప్రోటోకాల్ కి విరుద్ధంగా ఓకే వేదికపై ఇద్దరిని పిలిస్తే ఆ ప్రభుత్వ కార్యక్రమాలను బహిష్కరిస్తానని తెలిపారు.రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నిక ద్వారా శాసనసభ్యుడిగా ఎన్నికైన నాతో సమానంగా ప్రొటోకాల్ కు విరుద్ధంగా నామినేటెడ్ పుదుచ్చేరి ప్రభుత్వ డిల్లీ ప్రతినిధిని సైతం ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానిస్తే అటువంటి కార్యక్రమాలను ఇక నుంచి నేను బహిష్కరిస్తఇస్తానని.ప్రోటోకాల్ కు విరుద్ధంగా స్థానిక ఉన్న తాధికారులు వ్యవహరిస్తున్నారు.ఆహ్వాన పత్రికల్లో మల్లాడి పేరు ప్రచురించడం ఓకే వేదిక పైకి ఇద్దరినీ పిలవడం ప్రోటోకాల్ కు విరుద్ధమని అలా చేస్తే ప్రజల చేత ఎన్నికైన వ్యక్తిని అగౌర పరచడమే అవుతుంది.యానాంలో ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యుడుగా ప్రోటోకాల్ విషయంలో జరుగుతున్న అన్యాయం పై ఇప్పటికే అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ కి ఫిర్యాదు చేశాను.ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాను.పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి నామినేటెడ్ పదవి ఉన్న వ్యక్తి మల్లాడి పేరును యానంలో జరిగే కార్యక్రమాల్లో తప్ప పుదుచ్చేరిలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎందుకు వేయడం లేదు….ప్రోటోకాల్ విషయంలో యానాం అధికారుల తీరుకు నిరసనగా శనివారం రోజు పుదుచ్చేరి విద్యాశాఖ ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్ ముగింపు కార్యక్రమాన్ని యానాం శాసనసభ్యులుగా గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ నేను బహిష్కరిస్తున్నానని ఒక ప్రకటనలో తెలిపారు.