అఖండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5 వేల మందికి అన్న ప్రసాద వితరణ…
ఇది పరమశివుని సేవతో సమానం… అడిషనల్ ఎస్పీ టి పి విఠలేశ్వర్ …
బాపట్ల (అక్షర ప్రళయం)
పవిత్ర కార్తీక మాసం చివరి సోమవారం రోజున సూర్యలంక తీరాన అటు భక్తి దీపాలకు, ఇటు సమాజ సేవ దివ్వెలు పోటీపడ్డాయి. అఖండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేల మంది భక్తుల ఆకలి తీర్చాయి. సూర్యలంక సముద్ర తీరానికి సోమవారం వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. అన్నదానం మహాదానమనే సూక్తిని నిజం చేస్తూ అఖండ ఫౌండేషన్ భక్తుల సేవలో తరించింది. సుమారు 5 వేల మందికి అన్న ప్రసాదం అందించింది. కార్యక్రమానికి బాపట్ల అడిషనల్ ఎస్పీ టి. పి. విఠలేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులకు వడ్డించి మాట్లాడారు. సమాజ సేవలో అఖండ ఫౌండేషన్ ముందుండటం అభినందనీయమన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆహారమందించి వారి ఆకలి తీర్చటం పరమశివుని సేవతో సమానమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో తాను పాలు పంచుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. అఖండ ఫౌండేషన్ అధ్యక్షుడు విన్నకోట సురేష్ మాట్లాడుతూ; ఫౌండేషన్ ద్వారా ఎప్పటికప్పుడు సేవలను విస్తృతం చేస్తున్నామన్నారు. ఇటు పేద విద్యార్థులు, అనాథలు తమ ఫౌండేషన్ రెండు కళ్ళు లాంటివారని చెప్పారు. ఆ దేవదేవుని దివ్య ఆశీస్సులతో నేడు సూర్యలంక తీరాన భక్తులకు అన్న వితరణ చేసే భాగ్యం కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఫౌండేషన్ సెటిలర్ కళ్లం హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ; అన్నదానం మహాభాగ్యం అని, ఇది తమ కలిగిన అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఆడిటర్ చాపల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ; పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులకు అన్నప్రసాదాలు అందించడం ఎంతో సంతోషం దాయకమని, ఆయన అన్నారు..
ఈ కార్యక్రమంలో అఖండ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి వంగపాటి శివ, ఉపాధ్యక్షులు మామిడి రమేష్, చేజర్ల సతీష్, పులిగడ్డ శ్యాంప్రసాద్, వంగపాటి నాగరాజు, ఆరుమళ్ళ సుధాకర్ రెడ్డి, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.