ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన్న పొందూరు సింహాచలం..!
మధురవాడ (అక్షర ప్రళయం)
జీవీఎంసీ జోన్ 2 జోనల్ కమిషనర్ సింహాచలం పై మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ సోదాలు నిర్వహించారు.అక్రమ ఆస్తులు సంపాదన పై ఏసీబీ కి వచ్చిన సమాచారం మేరకు ఏసీబీ డిఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సిఐ కిశోర్ కుమార్, సిబ్బంది దాడులు ల్లో పాల్గున్నారు.సింహాచలం ఇళ్ళ తో పాటు కార్యాలయం,బంధువులు ఇళ్లల్లో సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా నాగేశ్వర రావు ( అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ) మాట్లాడుతూ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ఆదేశాలు మేరకు జీవీఎంసీ జోన్ 2 కమిషనర్ పొందూరు సింహాచలం ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని బలమైన ఆధారాలతో ఆయనపై కేసు నమోదు చేయడం జరిగింది…. సుమారు 6 చోట్ల సోదాలు నిర్వహించడం జరిగింది.. ఇప్పటివరకు ఐతే విశాఖలో ఒక ఫ్లాట్, 4 ఇళ్ళ స్థలాలు, శ్రీకాకుళం జిల్లాలో 13 ఇళ్ళ స్థలాలు, విజయవాడ లో ఒక ఇళ్లస్థలం, అలాగే శ్రీకాకుళం జిల్లాల్లో 4.5 ఎకరాల వ్యవసాయ భూమి, ఒక బ్రీజా కారు, మరియు బంగారు ఆభరణాలు ఇప్పటివరకు మా సోదాల్లో బయటకు వచ్చాయి… ఇంకా సోదాలు జరుగుతున్నాయి…. విశాఖలో ఒకచోట, శ్రీకాకుళంలో మూడు చోట్లు, హైదరాబాదులో ఒక చోట శోదాలను నిర్వహించాం. సోదాలు అనంతరం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తాం అన్ని తెలిపారు. ఈ సోదాలలో ఎమ్. రజని (జాయింట్ డైరెక్టర్)ఆ. ని.శా, ఎన్.విష్ణు అడిషనల్ ఎస్ పి ,ఎసిబి , మరియు బివిఎస్ నాగేశ్వరరావు, డిఎస్పీ ,ఎసిబి ,వి ఎస్ పి రమ్య డిఎస్పీ ల పర్యవేణ లో విశాఖ పట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు, రేంజ్ ఎసిబి అధికారులు పాల్గొన్నారు.