ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
విశాఖ దక్షిణం (అక్షర ప్రళయం)
క్రోత్తజాలరిపేట మరియు పైందొర పేట సమీపంలో ఈ నెల 20వ తేదీ తెల్లవారుజామున సుమరు 02:50 ని” సమయంలో నేవల్ కోస్టల్ బ్యాటరీ వద్ద ఉన్న జాలారిపేట గాంధీ బొమ్మ వెనక ఉన్న మత్స్యకారులు చేపలు వేటాడుకు ఉపయోగించబడే సామాన్లు వారు అమర్చుకున్న బడ్డీలు సుమారు నాలుగు బడ్డీలు వరకు అగ్ని ప్రమాదంలో కాలి ధ్వంసం అయిపోయినాయి, ఆ యొక్క విషాదాన్ని తెలుసుకున్న వెంటనే స్పందించిన విశాఖ దక్షిణ నియోజకవర్గo ఎమ్మెల్యే అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ ఆయొక్క విషాదం జరిగిన రోజుల్లో అసెంబ్లీ సమావేశాల్లో ఉంటు కూడా వెంటనే ఈ యొక్క సమస్యకు స్పందించి తక్షణమే బడ్డీలు కాలిపోయిన మత్స్యకార బాధితులకు తనవంతు సహాయ సహకారాలు అందజేస్తానని మాట ఇస్తూ… ముందుగా నష్టపోయిన ఈ యొక్క నలుగురు బాధితులకు తన యొక్క జనసైనికులతో బాధితులైనటువంటి (1) అరిసిల్లి చంటిబాబు 2) వాడమోదుల అయ్యాబాబు 3) చింతపల్లి వీర్రాజు 4) కూర్మాన రాజు లకు ఎమ్మెల్యే వంశీకృష్ణ తల ఒక్కరకు రూ5వేలు చప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ యొక్క కార్యక్రమంలో జలారిపేట కులపెద్ద అయినటువంటి నోల్లు మురళి, జంబు, జయకుమార్ అలాగే సంఘం ప్రెసిడెంట్ అయినటువంటి చింతపల్లి పోతురాజు, వైస్ ప్రెసిడెంట్ కాసారపు వాసు, సురకల శ్రీను, సెక్రట్రిలు చింతపల్లి జోగిరాజు , చింతపల్లి మధు, అలాగే 30వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిని అయినటువంటి ఉసిరికాయల యజ్ఞశ్రీ, జనసేన నాయకులు నాని మరియు మత్స్యకార సంఘ నాయకులు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.