వేదాంత- వి.జి. సి.బి పోర్టు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల తయారీ పై శిక్షణా కార్యక్రమం
వన్ టౌన్ (అక్షర ప్రళయం)
వేదాంత లిమిటెడ్-వి.జీ.సి.బి పోర్ట్ మరియు అఫ్ప్రో సంస్థ సంయుక్త సారధ్యంలో మంగళవారం ఉదయం 11 గంటలకు పాత పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఉన్న కొండ గుడి పుణ్యక్షేత్రం ట్రైనింగ్ హాల్లో నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పలువురు దివ్యాంగులు మరియు నిరాశ్రయుల కొరకు కొవ్వొత్తుల తయారీ శిక్షణా ప్రారంభోత్సవం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమం లో కొవ్వొత్తులు తయారీ నందు పదిహేను రోజులు శిక్షణ ఇచ్చి, ఈ శిక్షణా అనంతరము శ్రద్ధ కలిగిన వారి జీవనోపాధి కొరకు అవసరమైన సామాగ్రి మరియు ముడి సరుకులు ఇవ్వనున్నారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండ గుడి పుణ్యక్షేత్ర కరస్పాండెంట్ రెవ.ఫాదర్ జోసఫ్ విచ్చేసి వారి చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథి గా విచ్చేసిన వేదాంత – వి.జి.సి.బి పోర్టు సి.ఏస్.ఆర్ హెడ్, పి.ఆర్ శ్రీలక్ష్మి జె.ఏస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి వ్యక్తి లో తగిన నైపుణ్యం ఉంటాయని శిక్షణా ద్వారా నైపుణ్యాన్ని పెంచుకుంటే జీవితంలో అభివృద్ధిని చెందగలరు అని తెలియజేశారు. జీవితంలో ఈటువంటి స్వయం ఉపాధి నేర్చుకోవడం ద్వారా ఎవరి మీద ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందుతూ జీవించొచ్చు అని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలియచేశారు.
ఈ కార్యక్రమానికి ఆఫ్ప్రో ప్రాజెక్ట్ మేనేజర్ కే. విజయ్ భాస్కర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వై.అశోక్ కుమార్, కమ్యూనిటీ మొబలైజర్ అనిల్, ఆశ, సాయి, శిక్షణలో 30 మంది సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం దివ్యాంగులకు, నీరాశ్రయులకు భోజనం మరియు పండ్లు పంపిణీ చేశారు.