పేదల, బోగస్ గ్రూప్ లతో డబ్బులు తిన్న సి.ఓ ల నుండి ఆర్పీ ల చిట్టా సిద్ధం చేస్తున్నాము
ఎమ్మెల్యే గళ్ళా మాధవి
మెప్మా అక్రమాల పై ఉక్కు పాదం మోపుతాం ..పేదల, బోగస్ గ్రూప్ లతో డబ్బులు తిన్న సి.ఓ ల నుండి ఆర్పీ ల చిట్టా సిద్ధం చేస్తున్నాము.ఆర్పీలు వసూళ్లు చేస్తే తనను నేరుగా సంప్రదించాలని తెలిపిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్థిక చేయూత అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశ్యమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళలకు ఉపాధి కల్పించడమే మా లక్ష్యమని, మహిళా సంఘాల నిధుల విషయంలో ఇటీవల చాలా అక్రమాలు వెలుగు చూస్తున్నాయని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి మెప్మా అధికారుల అక్రమాల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.గత 5 సంవత్సరాల్లో భారీగా అక్రమాలు జరిగాయని గుర్తిస్తున్నామని, ఇందులో ఎవరెవరి పాత్ర ఉన్నదో గుర్తిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.