పోలీస్ విభాగం పై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి

హోంమంత్రి వంగలపూడి అనిత

విశాఖపట్నం (అక్షర ప్రళయం)

పోలీస్ విభాగం పై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ విభాగంలో జీరో నుంచి అభివృద్ధిని మళ్లీ మొదలు పెట్టిందన్నారు. పోలీస్ విభాగం అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ఆరిలోవ పోలీస్ స్టేషన్‌కు రహదారిలో ఉన్న కల్వర్టును జీవీఎంసీ నుంచి కోటి రూపాయలు విడుదల చేసి మరమ్మత్తులు చేస్తామని హోంమంత్రి వెల్లడించారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ లోని ఆదివారం మధ్యాహ్నం ఆమె మీడియాతో మాట్లాడారు. విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకునందుకు సంతోషంగా ఉందని చెప్పారు. 2018 లో అప్పటి హోంమంత్రి చిన్నరాజప్ప చేతులమీదుగా భూమి పూజ జరిగిన ఆరిలోవ పోలీస్ స్టేషన్‌కు కూటమి ప్రభుత్వమే ప్రారంభించిందని గుర్తు చేశారు. 2018లో పొలీస్ స్టేషన్‌కు శంకుస్థాపన జరిగిన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రారంభోత్సవానికి నోచుకోలేదని చెప్పారు. ఆరిలోవ పోలీస్ స్టేషన్‌కు ఫర్నిచర్ ఇచ్చిన డివిస్ లాబోరేటరీస్‌కి హోంమంత్రి వంగలపూడి అనిత ధన్యవాదాలు తెలిపారు. సమాజంలో గుడి, బడితో పాటు పోలీస్ స్టేషన్ ముఖ్యమని అన్నారు. ఆరిలోవ పోలీస్ స్టేషన్‌ పై అందరికీ జాలి ఉండేదని ఆరిలోవ పోలీస్ స్టేషన్ తుపాన్ షెల్టర్లు భవనంలో ఉండేదని చెప్పారు. విశాఖ రోడ్డు యాక్సిడెంట్ బాదితులు సహకార కేంద్రం ప్రారంభించామని అన్నారు. విశాఖలో రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని అన్నారు. రోడ్డు ప్రమాద బాధితులు సహాయం కోసం 7995095793 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని తెలిపారు. కొన్ని ఇన్యూరెన్స్ పాలసీల్లో మార్పు రావాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. అందుకే ఈ పాలసీ మార్పు మీద దృష్టి పెడుతున్నామని చెప్పారు. ఆటోల వల్ల కొంత సమస్య ఉందని అన్నారు. ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పరంగా శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. వైసీపీ పాపాలు బయట పడుతుంటే ట్వీట్ చాటున బాధితులు బయటకు వస్తున్నారని తెలిపారు. విజయసాయి, వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు నేరాల్లో భాగస్వామ్యులు అయ్యారని బయట పడుతోందన్నారు. కనీస విలువలు లేని శకుని లాంటి వ్యక్తి విజయసాయిరెడ్డి అని ఆరోపించారు. పెద్ద వాళ్లపై విజయసాయి మాటలు బాధకరమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గంజాయి పై ఉక్కుపాదం మోపామని అన్నారు. కాకినాడ పోర్ట్ వ్యవహారంలో అన్ని తెలుస్తున్నాయని అన్నారు. వైసీపీ నేతలు అందరినీ బెదిరించారని ఆరోపించారు. బియ్యం అక్రమ రవాణా మీద సీబీసీఐడీ దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ చక్కగా పని చేస్తోందని ప్రశంసించారు. ఎక్కడ భూ అక్రమాలు చూసినా అందులో వైసీపీ నేతలు పాత్ర ఉందని విమర్శించారు. విశాఖలో మాజీ ఎంపీ ఏంవీవీ సత్యనారాయణ అక్రమాలు బయటకు వచ్చాయన్నారు. గడిచిన ఐదేళ్లలో ఒక్క పోలీస్ స్టేషన్ నిర్వహణ సరిగా చేయలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపై దృష్టి పెట్టామన్నారు. నగరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. డ్రోన్ కెమెరాలతో గంజాయి గుర్తించి నాశనం చేస్తున్నామన్నారు. ఈగల్ వ్యవస్థ అప్పుడే పని మొదలు పెట్టిందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో డీజీపీ ద్వారకా తిరులమరావు, విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి, విశాఖ రేంజ్‌ డి.ఐ.జి. గోపీనాథ్‌ జెట్టి, డీసీపీ 01 అజిత వేజెండ్ల, డీసీపీ 02 మేరీ ప్రశాంతి, క్రైం డీసీపీ లతా మాధురి ఇతర అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *