గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్
గుంటూరు (అక్షర ప్రళయం)
గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపిఎస్ ఆధ్వర్యంలో అంతరాష్ట్ర ఎర్రచందనం అక్రమ రవాణా(స్మగ్లింగ్) ముఠా గుట్టు రట్టు చేసిన మంగళగిరి రూరల్ పోలీసులు….. రూ 3.5 కోట్ల విలువైన ఎర్ర చందనం దుంగలు స్వాధీనం. తమిళనాడు రాష్ట్రమునకు చెందిన ఇద్దరు నిందితులు అరెస్ట్… సినీ పక్కిలో పేపర్ బండిల్స్ లోడ్ మధ్యలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ముఠా*అటవీ పరిరక్షణ చట్టం, దొంగతనం, ఎర్రచందనం స్మగ్లింగ్ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయటం జరిగింది.మంగళగిరి రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించిన ఎస్పీ సతీష్ కుమార్… ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుందని రాబడిన సమాచారంతో గుంటూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళగిరి రూరల్ సిఐ శ్రీనివాసరావు, రూరల్ ఎస్సై వెంకట్ మరియు సిబ్బంది కాజా టోల్ గేట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టి,ఆ సమయంలో అనుమానాస్పదంగా ఉన్న టి.ఎన్ 52 హెచ్ 6683 అనే లారీని అదుపులోకి తీసుకోగా, లారీ డ్రైవర్లు, క్లీనర్ ఇద్దరు వ్యక్తులు పారిపోవడం జరిగింది. అని ఎస్పీ తెలిపారు