మానవ హక్కుల కోసం ప్రతీ ఒక్కరూ ఉద్యమించాలి..
ఏ. ఐ.హెచ్.ఆర్.పి.సి. ఛైర్మన్ షేక్ సిరాజుద్ధిన్..
గుంటూరు (అక్షర ప్రళయం)
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ( ఏ.ఐ.హెచ్.ఆర్.పి.సి) జాతీయ ఛైర్మన్ ఆద్వర్యంలో మంగళవారం గుంటూరులో ఘనంగ మానవ హక్కుల గురించి అవగాహన సదస్సు జరిగింది. ఈ సంధర్భంగా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సంస్థ వారు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న ముఖ్యులు మాట్లాడుతూ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఎలాంటి వివక్ష లేకుండా సమాన హక్కులతో జీవించాలని ఐక్యరాజ్యసమితి లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇందుకోసం 1948 డిసెంబర్ 10న పారిస్ వేదికగా సభ్య దేశాలన్నీ ఒక కీలక ఒప్పందంపై సంతకం చేశాయని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అతిథులుగా గవర్నమెంట్ కి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి సునీల్ కుమార్, గుంటూరు జిల్లా న్యాయవాదుల బార్ అసోసియేషన్ ట్రెజరర్ కె దేవదాస్, ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ప్రొటక్షన్ కౌన్సిల్ చైర్మన్ షేక్ సిరాజుద్దీన్, రాష్ట్ర మరియు అన్ని జిల్లాల మానవ హక్కుల సంఘ సభ్యులు హాజరవటం జరిగింది.