విశాఖపట్నం (అక్షర ప్రళయం)
11 డిసెంబర్ 2024 నాడు జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం నందు 69 వార్డ్ కార్పొరేటర్ కాకి గోవింద రెడ్డి..! గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినారు దీని వలన రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల మనోభావాలు తీవ్రముగా దెబ్బతిన్నాయి, కరోనా వంటి అత్యంత విపత్కర పరిస్థితుల్లో కూడా సచివాలయ ఉద్యోగులు ప్రజలకు సేవలందించి అందరి మన్ననలు పొందారు .ఒక గౌరవ స్థానం లో ఉంటూ వాస్తవాలు తెలుసుకోకుండా ఇలా మాట్లాడటం కడు శోచనీయం.గ్రామ వార్డ్ సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు అన్నారు.గ్రామ వార్డ్ సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరపున మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రెటరీ అసోసియేషన్ (ఏ.పి.ఎస్.డబ్లూ.ఏ.ఎస్.ఏ) తరపున విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ని కలిసి వినతిపత్రం ఇచ్చి వివరించడం జరిగినది. 69 వార్డ్ కార్పొరేటర్ కాకి గోవింద రెడ్డి మాటలను తీవ్రముగా ఖండిస్తున్నాము, ఆయన తన మాటలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాము.
ఒకసారి అత్మ పరిశీలన చేసుకొని మాట్లడవల్సింది గా ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయం ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లా కిరణ్ కుమార్ యాదవ్ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ చింతకాయల బంగార్రాజు మరియు విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు పి జె గణేష్ కుమార్ జనరల్ సెక్రటరీ రమణ, వైస్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ యాదవ్, జాయింట్ సెక్రటరీలు ఎస్ సాయి కృష్ణ, కర్రి రాజేష్ పాల్గొన్నారు.