ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్యమండలి జిల్లా కో-ఆర్డినేటర్ గా వెంకటరెడ్డి నియామకం
విశాఖపట్నం (అక్షర ప్రళయం)
సినీ రంగంలో ఎన్టీఆర్ ఒక ధృవతార అని ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్యమండలి కార్యవర్గం పేర్కొంది. విశాఖ డాబాగార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లోని శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్యమండలి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్యమండలి సంయుక్త కార్యదర్శి ఎన్ఎస్.మూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ఎస్.ఎన్ భాష, ఎస్సార్ జిల్లా కో-ఆర్డినేటర్ కొరపల్లి బాబు, అనకాపల్లి జిల్లా కోఆర్డినేటర్ ధర్మశెట్టి శ్రీనివాస్ తదితరులు ఎన్టీఆర్ చిత్రానికి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పూతి వెంకటరెడ్డి ని ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్యమండలి విశాఖజిల్లా కో-ఆర్డినేటర్ గా ప్రకటించారు. అనంతరం ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లాలోని సినీ పరిశ్రమకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్ లోని ఉన్న వారి సమస్యల పరిష్కారానికై కృషి చేస్తానని వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో సినిమా షూటింగులు ఎక్కువ జరిగేలా ప్రభుత్వం రాయితిలు కల్పించి ప్రోత్సహించాలని కోరారు. విశాఖలో కూడా చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందని భావించి, కో -ఆర్డినేటర్ గా వ్యవహరించడానికి అంగీకరించానన్నారు. విశాఖ జిల్లా నుంచి తనకు బాధ్యతలు అప్పగించిన ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్యమండలి సభ్యులకు కృతజ్ఞతలు వెంకటరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, సీనియర్ జర్నలిస్ట్ ఆర్.నాగరాజు, ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖ జిల్లా కార్యదర్శి గుండుపల్లి శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు ఈరోతి ఈశ్వరరావు, తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఉత్తరాంధ్ర ఉపాధ్యక్షులు ఎం.కృష్ణకిషోర్, కళాకారులు రమేష్ యాదవ్, రాజశేఖర్, ఎన్ఏడి వెంకటేష్ తదితరులు వెంకట్ రెడ్డి ని ఘనంగా సత్కరించి, అభినందనలను తెలిపారు.