విశాఖపట్నం (అక్షర ప్రళయం)
వ్యాపారి అదృశ్యం అయినట్టు 3టౌన్ పొలిస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది.ఈ నెల 11వ తేదీన ఉదయం 9:30 గంటలకు తన భర్త తన సొంత కారు నెంబర్ ఏ.పి 39టి.ఏ 5567, మారుతి కారులో వెళ్ళిపోయారు అని భార్య కేతి.దివ్య భారతి 3టౌన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాధి చేసారు. అధిక ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంటి నుండి వెళ్ళిపోయారు అని భార్య ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.
వివరాలు:- కేతా నవీన్ కుమార్ రెడ్డి,వయస్సు 33 సంవత్సరాలు, ఎత్తు 6.2′, రంగు నలుపు,దుస్తులు బ్లాక్ కలర్ ట్రాక్ ఫాంట్, మెరూన్ కలర్ టి షర్ట్,(ఇంటి నుండి వెళ్లిపోయినప్పుడు ధరించిన దుస్తులు),జుట్టు నలుపు రంగు నునుపు జుట్టు,కారు నెంబర్ ఏ.పి 39టి.ఏ 5567 మారుతి కారు,వృత్తి వ్యాపారం, వివాహం అయ్యి భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీస్ క్వార్టర్స్ దగ్గరా , చిన వాల్టైర్ తౌమిల్ స్ట్రీట్, విశాఖపట్నం చిరునామాలో ఉంటున్నారు.
ఆచూకి తెలిసిన వారు ఈ ఫోన్ నెంబర్ కు 9885830796 తెలియజేయగలరు.