తాళ్ళరేవు (అక్షర ప్రళయం)
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం
తాళ్ళరేవు మండలం లో పలు పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి పి.రమేష్….పరిశీలించారు. తాళ్ళరేవు మండలానికి చెందిన కోరంగి చిన బొడ్డు వెంకటాయపాలెం, సీతారామపురం, గాడిమొగ, లక్ష్మీ పతిపురం లలో గల పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను పాఠశాలలో విద్యాభోధన, సౌకర్యాలు, మధ్యాహ్నం భోజనం నాణ్యత లు అడిగి తెలుసుకున్నారు.ఈకార్యక్రమంలో స్ధానిక ఎమ్ ఆర్సీలు, ఉపాధ్యాయులు,మండలం విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.