వి.ఎం.ఆర్.డి.ఏ లో పనిచేసే ఉద్యోగస్తుల పదవీ విరమణ వయస్సును 60 నుండి 62 సం|| వరకు పొడిగించవలసిందిగా కోరిన ఛైర్మన్ ప్రణవ్ గోపాల్
న్యూస్ డెస్క్ (అక్షర ప్రళయం)
విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ( వి.ఎం.ఆర్.డి.ఏ)లో పనిచేసే ఉద్యోగస్తుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాల వరకు పొడిగించవలసిందిగా కోరుతూ ఛైర్పర్సన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ( వి.ఎం.ఆర్.డి.ఏ)లో స్టాఫ్ అండ్ ఆఫీసర్స్స్ అసోసియేషన్ అధ్యక్షులు యు.వి.ఎస్.ఆర్. ప్రసాద్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ రవిశంకర్ మానవవనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేష్ ని మంగళగిరిలో ఆయన నివాసంలో కలసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. మంత్రి నారలోకేష్ సానుకూలంగా స్పందించారు.