కొత్త రోడ్డు (అక్షర ప్రళయం)
కనకమహాలక్ష్మీ అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు బాగంగా 3వ గురువారం సందర్బంగా భక్తులు పలు చోట్ల ప్రసాదాలు పంచడం, అన్న దాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా అమ్మవారి ఆలయ సమీపంలో ఉన్న కొత్త రోడ్డు జంక్షన్ లో గల స్థానిక అమ్మవారి భక్తులు చందు వారి మిత్ర బృందం కొత్త రోడ్డు జంక్షన్ లో సుమారుగా 2వేల మందికి మహా అన్న దాన కార్యక్రమం నిర్వహించుట జరిగింది.
ఈ సందర్బంగా చందు వారి మిత్ర బృందం మాట్లాడుతూ దానాలన్నింటిలోకి అన్నదానం గొప్పది, అటువంటి అన్నదానం చేయడం ద్వారా అన్నార్తుల ఆకలి తీర్చే బాధ్యతను తమ సేవలలో భాగంగా చేస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమం చందు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో దయాళ్, లల్లి, గణేష్, జయేష్, శ్రీధర్ , కొండ, వెంకీ,సుధాకర్,సతీష్( తార), లక్ష్మణ్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.