1టౌన్ సి.ఐ. జి.డి.బాబు
పూర్ణ మార్కెట్ (అక్షర ప్రళయం)
రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగకుండా ఉంటే చర్యలు తప్పవని 1టౌన్ సి. ఐ హెచ్చరించారు.
వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉండే రౌడీ షీటర్ లు అందరికి ఆదివారం జి.డి బాబు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా జి.డి.బాబు మాట్లాడుతూ రౌడీ షీటర్స్ ఎవరైనా గాని గొడవలు గాని శాంతి భద్రతలకు విజ్ఞప్తి కలిగించినట్లయితే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతుందని హెచ్చరించడం జరిగింది. అలాగే రౌడీషీర్ అందరు కూడా ఎక్కడైనా ఏదైనా తప్పు జరుగుతుందని వారికి అనిపిస్తే వెంటనే పోలీసు వారుకి తెలియజేసి నేర సమాచారన్ని ఇవ్వవలసిందిగా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా రౌడీషీటర్ లతో శత ప్రమాణ స్వీకారం చేయించి వారికి మీకోసం మీ పోలీస్ కరపత్రాన్ని అందించి అందులో…9440697019… అనే ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కి ఫోన్ చేస్తే వెంటనే తగిన సహాయ సహకారాలను అందిస్తామని తెలియజేయడం జరిగింది.