ఉత్తమ సేవా ప్రశంస పత్రం అందుకున్న ఎస్.ఐ టి.శ్రీధర్..!

డాబాగార్డన్స్, (అక్షర ప్రళయం)

విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందిస్తున్న పోలీస్ సిబ్బందికి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఇందులో భాగంగా విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మహారాణిపేట పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ విభాగ అదనపు ఎస్ఐ టి.శ్రీధర్ కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. స్ఫూర్తిదాయకమైన సేవలు అందించి పోలీస్ శాఖ ఔన్నత్యాన్ని పెంపొందించారని, మున్ముందు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కలెక్టర్ హరేంధిరప్రసాద్‌ అన్నారు. ప్రతి ఒక్కరు విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తే తగిన గుర్తింపు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహమే మరింత బాధ్యతను పెంచుతుందని ట్రాఫిక్ అదనపు ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *