వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షునిగా సారిపిల్లి సంతోష్

న్యూస్ డెస్క్ (అక్షర ప్రళయం)

తనమీద నమ్మకంతో విశాఖ ఉత్తర నియోజకవర్గం వైయస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుని గా నియమించిన వైయస్సార్ సిపి పార్టీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి , విశాఖ జిల్లా వైఎస్ఆర్ సీపీ అద్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కెకె రాజు లకు సారిపిల్లి సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం గుడివాడ అమర్నాథ్, కేకే రాజులను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా పార్టీకి సేవలందిస్తున్న సంతోష్ కు మరెన్నో ఉన్నత పదవులు లభించాలని ఆకాంక్షించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం వైయస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుని గా సారిపిల్లి సంతోష్ కుమార్ ను నియమిస్తూ బుధవారం కేంద్రకార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడిన సమాచారం తెలిసిన పలువురు నియోజక వర్గ నాయకులు,కార్యకర్తలు సారిపిల్లి సంతోష్ ను అభినందనలతో ముంచెత్తారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *