విశాఖపట్నం, ఫిబ్రవరి:22(అక్షర ప్రళయం)
వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేర నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ, పోలీస్ సేవల విస్తరణలో కీలక పాత్ర పోషించిన ఇన్‌స్పెక్టర్ జి.డి. బాబు కి విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ శనివారం రెండు
ప్రశంస పత్రాలను ప్రదానం చేశారు.నగరంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం, ప్రజలకు పోలీస్ సేవలను సమర్థంగా అందించడం వంటి అంశాలలో ఇన్‌స్పెక్టర్ కృషి కి ప్రశంసనీయం. ప్రజల భద్రత కోసం ఆయన చేపట్టిన ప్రత్యేక చర్యలను గుర్తించి ఈ గౌరవాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.