వన్ టౌన్, (అక్షర ప్రళయం)

విశాఖపట్నం నగర ప్రజల భద్రత, సౌకర్యం కోసం “మీ కోసం మీ పోలీస్” కార్యక్రమాన్ని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ జి.డి. బాబు తన సిబ్బందితో కలిసి నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ శంకరబ్రత భగ్చి ఆదేశాల మేరకు, పోలీసులు ప్రజలకు డోర్ డెలివరీ పోలిసింగ్ అందిస్తూ, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కారం చేస్తున్నారు.
ప్రజల వద్దకే పోలీస్ సేవలు…
సాధారణంగా ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదులు నమోదు చేయాల్సిన అవసరం ఉండేది. అయితే, ఇప్పుడు ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా పోలీసులు ప్రత్యక్షంగా ప్రతి ఇంటికి వెళ్లి మహిళలు, వృద్ధులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు సైబర్ నేరాలు, , దొంగతనాలు, చీటీల మోసాలపై అవగాహన కార్యక్రమాల్ని కండక్ట్ చేయడం జరిగింది.
అవసరమైనప్పుడు పోలీస్ సహాయం..
కేవలం అవగాహన కార్యక్రమమే కాకుండా, ఏ సందర్భంలోనైనా 24/7 ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేస్తే పోలీసులు స్పందిస్తారనీ, అలాగే, ఇన్స్పెక్టర్ జి.డి. బాబు గారి సెల్ నం .9440796019 ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలు తెలియజేసుకోవచ్చు.
పోలీసుల సేవలు – నిరంతరం మీతో..
ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు పోలీసులను మరింత చేరువగా భావిస్తూ, వారి సహాయాన్ని తీసుకునే అవకాశం పొందుతున్నారు. విశాఖపట్నం సిటీ పోలీస్ శాఖ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం ప్రజల అభినందనలకు పాత్రమవుతోంది.