ఆర్కే బీచ్,విశాఖపట్నం (అక్షర ప్రళయం)
ఆర్కే బీచ్ సమీపంలో గుర్తు తెలియని మృత దేహం గురువారం ఉదయం తీరానికి కొట్టుకు వచ్చింది. ఈ
క్రమంలో ఆర్కే బీచ్ సి పెరల్ హెూటల్ సమీపంలో బీచ్ నుండి మృతదేహం రావడంతో స్థానికులు, మహారాణి పేట పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న మహారాణి పేట పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ పివిఆర్ రాజు, రైటర్ సిహెచ్ రవికుమార్ మృతుని వివరాలు
నమోదు చేసుకున్నారు. అయితే మృతునికి చిన్న చిన్న గాయాలు ఉన్నాయని, శరీరంపై బట్టలు లేవని, 30 సంవత్సరాలు వయసు ఉండవచ్చని తెలిపారు. మృతదేహాన్ని శవపంచనామ నిమిత్తము కేజీ హెచ్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఈ సందర్బంగా తెలిపారు. మృతుని పూర్తి వివరాలు,మృతికి గల కారణాలు తెలియవలసి ఉందని తెలిపారు. మహారాణిపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.పై ఫోటో లో వున్న గుర్తు తెలియని మగ మృతదేహం ఆచూకీ తెలిసిన వారు మహారాణి పేట పోలీస్ స్టేషన్ సి.ఐ 9440796010,
9849589880 నంబర్లకు ఫోన్ చేసి అధికారులకు తెలియజేయగలరు.