ఘనంగా జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవం
విశాఖ దక్షిణం,(అక్షర ప్రళయం)

ఆదివారం పలు ఆలయాలల్లో శ్రీ రామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా
విశాఖ దక్షిణం నియోజక వర్గం 35వ వార్డ్ సి హార్స్ జంక్షన్ రామకృష్ణ వీధి శ్రీరామ సేవా సంఘం కమిటీ ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న వై.ఎస్.అర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు ద్రోణం రాజు శ్రీ వాత్సవ కళ్యాణంలో పాల్గొని, కల్యాణోత్సవాన్ని తిలకించి, అన్న ప్రసాదాన్ని స్వీకరించి శ్రీ సీతారాముల అనుగ్రహం పొందారు.
మధ్యాహ్నం సుమారు 3000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది.