హేమంత్ చరపాక కు గౌరవ డాక్టరేట్

అనకాపల్లి(అక్షర ప్రళయం)

అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం గ్రామానికి చెందిన ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ అనకాపల్లి జిల్లా చైర్మన్, ఫార్మసీ సంక్షేమ సంఘం  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రైసింగ్ హాండ్స్ ఫర్ హోప్ స్వచ్ఛంద సంస్థ అనకాపల్లి జిల్లా అధ్యకులు హేమంత్ చరపాక కి ఏషియ ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ యు.ఎస్.ఎ  గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేసింది. గురువారం హైదరాబాద్ లో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఏషియా ఇంటర్నేషనల్ స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్ , డాక్టర్ గూడూరి చెన్నారెడ్డి చేతుల మీదగా హెల్త్ కేర్ సర్వీసెస్ ఇన్ ఫార్మసీ లో గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ హేమంత్ చరపాక మాట్లాడుతూ నా సేవలను గుర్తించి నాకు డాక్టరేట్ ప్రధానం చేసిన ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు .ఈ గౌరవ డాక్టరేట్ ద్వారా తనకి మరింత బాధ్యత పెరిగిందని, తనకి కార్యక్రమాల్లో అన్ని వేళల సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని, రాబోయే రోజుల్లో మరెన్నో కార్యక్రమాలు ఫార్మసీ రంగంలో చేపడతానని తెలియజేశారు. ఈ సందర్భంగా ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ నేషనల్ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్, ఫార్మసీ సంక్షేమ సంఘం చైర్మన్ మద్దెల సురేష్ బాబు, ఇండియన్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు నల్లమల్లి ఆదిరెడ్డి, ఫార్మసీ సంక్షేమ సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు తదితరుల అభినందనలు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *