రూ.25వేలు జరిమానా విధించిన సింగపూర్ కోర్టు
న్యూస్ డెస్క్ (అక్షర ప్రళయం)
స్టార్ హోటల్‌లో మలవిసర్జన చేసినందుకు భారతీయుడికి రూ.25వేలు జరిమానా విధించిన సింగపూర్ కోర్టు సింగపూర్‌లో పనిచేస్తున్న ఓ భారత కార్మికుడు.. గతేడాది క్యాసినో కోసం వెళ్లి మద్యం మత్తులో స్టార్ హోటల్ ఎంట్రెన్స్‌లోనే మలవిసర్జన చేసిన వ్యవహారాన్ని కోర్టు విచారించింది. ఈ కేసులో అతడిని దోషిగా తేల్చింది. ఈ క్రమంలోనే 400 సింగపూర్ డాలర్లు (రూ.25వేలు) జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. గతేడాది అక్టోబర్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన ఫొటో అప్పట్లో వైరల్ అయ్యింది.