విజయవాడ, సెప్టెంబర్ 24 : (అక్షర ప్రళయం)
మైనార్టీ వర్గాలకు అందించే సంక్షేమ పథకాలను పునర్ వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ జమీల్ అహ్మద్ బేగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హజ్ యాత్రకు వెళ్ళే వారికి రూ.లక్ష సాయం, ఇమామ్‌లు, మౌజన్‌లకు గౌరవ వేతనం కింద నెలకు రూ.10 వేలు, రూ.5 వేలు త్వరలో ఇస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. రాష్ట్రంలోని ముస్లింలు అందరూ కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచారన్నారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెడుతున్న వక్ఫ్‌బోర్డు బిల్లుపై ముస్లిమ్‌లకు న్యాయం జరిగేలా ప్రయత్నించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ జమీల్ అహ్మద్ బేగ్ కోరారు.