సిటీ నలుమూల నుంచి భారీగా చేరుకున్న కూటమి శ్రేణులు..
గోవింద నామాలతో మారుమ్రోగిన దీక్షా శిబిరం…
విశాఖపట్నం (అక్షర ప్రళయం)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ చేసిన నెయ్యి వినియోగం భక్త జనకోటి మనోభావాలను దెబ్బ తీసింది. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పాలక మండలి వ్యవహార శైలి, లడ్డూ కల్తీ ద్వారా చేసిన అపచారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఎల్ఐసి బిల్డింగ్ వద్ద మహా యాగం నిర్వహిస్తున్నారు. ఈ కార్యకమంలో హోమం నిర్వహించి, దీక్షలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ “తిరుమల ప్రసాదాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. లడ్డూ తయారీలో కల్తీని కలలో కూడా ఊహించలేము. ఈ ఘటనపై ప్రతి ఒక్కరిలో వేదన ఉంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం తెలియచేయడం అందరి బాధ్యత. దైవానికి ఎవరి వల్ల అపచారం జరిగినా… అపచారం చేసినవారికి ఆ పశ్చాత్తాప భావన లేకపోయినా లోక క్షేమం కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని పవన్ కళ్యాణ్ సంకల్పించారనీ అన్నారు. రేపటి నుంచి మరిన్ని కార్యక్రమాలు చేస్తామని అన్నారు.కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, వివిధ నియోజవర్గ ఇన్చార్జి లు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లు,ఉత్తరాంధ్ర జిల్లాల కో ఆర్డినేటర్ లు, జిల్లా నాయకులు, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లు , మాజీ కార్పొరేటర్ లు ,వార్డ్ అధ్యక్షులు, వివిధ విభాగాల అధ్యక్షులు, కూటమి శ్రేణులు, వీర మహిళలకు, పార్టీ కార్యకర్తలు తో పాటు టిడిపి, బిజెపి నేతలు పాల్గొన్నారు.