చెన్నైలోని “కాందార్‌ నగర్‌’ రోడ్డుకి ఎస్పీ బాలు పేరు

న్యూస్ డెస్క్ (అక్షర ప్రళయం)

చెన్నైలోని కాందార్‌ నగర్‌ రోడ్డుకి ఎస్పీ బాలు పేరుతమిళనాడులోని ఓ రోడ్డుకి సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు పెడుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎస్పీబీ నివాసం ఉన్న చెన్నైలోని నుంగంబాక్కంలో ఉన్న కాందార్‌నగర్‌ మెయిన్‌రోడ్డును ‘ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రోడ్డు’గా మార్చారు. ఈ మేరకు తమిళనాడు సీఎం స్టాలిన్‌ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ పెట్టారు. సీఎం స్టాలిన్‌ నిర్ణయం పట్ల ఎస్పీ బాలసుబ్రమణ్యం అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *