మంత్రి సత్య ప్రసాద్
అక్షర ప్రళయం (అమరావతి)
విధులకు అనధికారికంగా గైర్హాజరయ్యే వైద్యులు, సిబ్బందికీ వెంటనే సంజాయిషీ నోటీసులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ ఆదేశించారు.
రాష్ట్ర సచివాలయంలో గురువారం వైద్య ఆరోగ్య సిబ్బంది హాజరు తీరుపై ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే వారు సకాలంలో విధులకు రాకపోయినా, ముందుగానే వెళ్లిపోయినా ఆ ప్రభావం వైద్య సేవలపై ఉంటుందన్నారు. ‘హాజరు నమోదులో మార్పులు తీసుకొచ్చి…విధులకు సకాలంలో రానివారికి.. ఆటోమేటిక్గా సంజాయిషీ నోటీసు జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఒకరోజు వేతనాన్ని కోతపెట్టి ఇతర క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలి’ అని ఉన్నతాధికారులను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. ఈ సందర్భంగా యాప్ ద్వారా జరుగుతున్న హాజరు నమోదు ప్రక్రియను పరిశీలించి, మార్పులపై పలు సూచనలు చేశారు.