రిజిస్ట్రేషన్ పత్రాలను అందిస్తున్న పవన్‌కల్యాణ్.
అమరావతి: ( అక్షర ప్రళయం)
అన్నమయ్య జిల్లాలోని మైసూరవారిపల్లి పాఠశాలకు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తన సొంత నిధులతో క్రీడా మైదానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇటీవల మైసూరవారిపల్లి గ్రామసభకు వెళ్లినప్పుడు అక్కడి పాఠశాలకు ఆటస్థలం లేదన్న విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పవన్‌కల్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. దసరాలోపు ఏర్పాటు చేస్తానని ఇచ్చిన మాట మేరకు తన సొంత ట్రస్టు నుంచి రూ.60 లక్షలతో ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసి గ్రామ పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను బుధవారం రాత్రి మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లోకి రావడానికి ముందే ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో పవన్‌కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్‌లెన్సు పేరిట ట్రస్టు మొదలుపెట్టాను. విద్యార్థుల చదువుకు సాయం చేయడం, ఉపాధి అవకాశాలు కల్పించడం దీని ఉద్దేశం.