భారీ ఎత్తున హాజరైన ప్రజలు
మాడుగుల అక్షర ప్రళయం
దసరా నవరాత్రులు పురస్కరించుకొని మాడుగుల దుర్గలమ్మ వారి ఆలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. సుమారు 5000 మంది భక్తులు ఈ అన్నదానంలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. దీంతో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. అలయ కమిటీ అధ్యక్షుడు బసవ రామ పరమేశ్వరరావు, జిసిసి మేనేజర్ నమశ్శివాయ ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హలో దాతలు సహకార అందించారు.