విజయవాడ: అక్టోబర్11 (అక్షర ప్రళయం)
విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో అపచారం జరిగింది. ఓ పోలీసు ఆఫీసర్ షూ వేసుకుని ఆలయ ముఖద్వారం వద్ద విధులు నిర్వహించడం విమర్శలకు దారి తీసింది. షూ వేసుకుని ఆలయ ముఖద్వారం వద్ద డ్యూటీ చేయడంపై దుర్గమ్మ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఆలయ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తు న్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భవానీ భక్తులు. సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు..