విశాఖపట్నం (అక్షర ప్రళయం)
విజయ దశమి సందర్భంగా నిమజ్జనం జరుగుతున్న ప్రాంతాలను సందర్శిస్తూ , ప్రజలకు ఏటువంటి అసౌకర్యం కలుగకుండా, నిమజ్జనాలు ప్రశాంతముగా జరిగేలా, స్వయంగా పర్యవేక్షిస్తున్న నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., నగరంలో కాళీమాత నిమజ్జనాలు జరుగుతున్న పెద జాలరిపేట , సాగర్ నగర్, భీమిలి బీచ్ , పెందుర్తి సరిపల్లి , అప్పుకొండ ఇతర ప్రాంతాలను స్వయంగా వెళ్ళి పరిశీలిస్తున్న సిపి.నగరంలో గల అన్ని నిమజ్జన ప్రాంతాలను సందర్శిస్తున్న నగర పోలీసు కమిషనర్ ప్రతీ ప్రాంతంలో సరిపడు పోలీసు సిబ్బందితో పాటుగా, సరిపడు గజఈత గాళ్ళు ఉన్నదీ పరిశీలించి, వారికి తగు సమయానికి ఆహారం అందేటట్లు , ప్రజలెవరూ సముద్రంలోనికి నేరుగా వెళ్ళకుండా ఉండేట్లు, భారీ విగ్రహాల నిమజ్జనం కొరకు క్రేన్లు , భక్తుల కొరకు తీరం నందు లైటింగ్ ఏర్పాట్లు సక్రమముగా ఉండేట్లు, నిమజ్జన ప్రాంతాలకు వెళ్ళే రహదారులు ట్రాఫిక్ లేకుండా ఉండేలా, నిమజ్జనాలు ప్రశాంతముగా జరిగేలా తగు చర్యలు తీసుకోవాలని, ఆయా సంబంధిత అధికారులకు సిపి ఆదేశాలు జారీచేశారు.