అమరావతి స్టేట్ బ్యూరో (అక్షర ప్రళయం)
నేడు రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండగ వారోత్సవాలు ప్రారంభం అవుతున్నాయి.డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు సంబందించి పల్లె పండగ వారోత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు.దింతో గ్రామసభల్లో చేసుకున్న తీర్మానాలు కార్యరూపం దాల్చనున్నాయి.
అక్టోబర్ 14 నుంచి 20 వరకు జరగబోయే ‘పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు’ కార్యక్రమం ద్వారా రోడ్లు గోకులాలు ట్రెంచ్ లు ఉపాధి పనులు చేపట్టనున్నారు.ఈ పల్లె పండగ వారోత్సవాలు ద్వారా
రాష్ట్రంలో 4,500 కోట్ల రూపాయల నిధులతో 30 వేల పనులు జరగనున్నాయి. 500 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణం. 3000 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్ల నిర్మాణం. 8 లక్షల కుటుంబాలకు 100 రోజుల పని.
25,000 గోకులాలు.10,000 ఎకరాల్లో నీటి సంరక్షణ ట్రెంచులు.చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే ధృడ సంకల్పం కలిగిన నాయకత్వంతో రాష్ట్ర ప్రగతి పరుగులు పెడుతుంది.