పోలీసు సిబ్బందిని అభినందించిన సి.పి., డా.శంఖబ్రత బాగ్చి..
విశాఖపట్నం (అక్షర ప్రళయం)
కుటుంబ సమస్యల కారణముగా ఆత్మ హత్య చేసుకోవడానికి ప్రయత్నించిన మహిళను కాపాడిన నగర పోలీసులు. మంగళవారం నగరానికి చెందిన ఒక వివాహిత మహిళ తన భర్త వేధింపుల కారణముగా ఆత్మ హత్య చేసుకోవడానికి ఆర్కే బీచ్ ఏరియా వద్ద బీచ్ లోనికి ప్రమాధకరముగా వెళ్ళడం జరిగినది, అక్కడే విధులలో ఉన్న బీచ్ మొబైల్ పార్టీ వారు, లైఫ్ గార్డు సదరు మహిళ ను గుర్తించి, తక్షణం సదరు మహిళను నిలువరించి, ఆత్మహత్య నుండి కాపాడడం జరిగినది.తక్షణం స్పందించి, సకాలంలో బాదితురాలను ఆత్మహత్య చేసుకోకుండా కాపాడిన పోలీసు సిబ్బందిని నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., ప్రత్యేకముగా అభినందించారు.