రోడ్డుపై పేరుకుపోయిన చెత్త పట్టించుకోని జీవీఎంసీ సిబ్బంది!
ఇలా ఐతే రోగాలు తప్పవు..?
విశాఖ దక్షిణం, అక్టోబర్ 14 (అక్షర ప్రళయం)
జీవీఎంసీ సిబ్బందికి ఇంకా దసరా పండుగ మత్తు వదిలినట్టు కనబడటం లేదు..!వరుస సెలవలు రావడంతో జీవీఎంసీ వార్డులో చెత్త కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. జీవీఎంసీ దక్షిణ నియోజకవర్గం చంగల్రావుపేట, 37వ వార్డులో గత మూడు రోజులగా చెత్త నిండు కుండ మాదిరగా
తలపిస్తుంది. అటుగా నడవలంటేనే స్థానికులు భయపడిపోతున్నారు. ఇదే కొనసాగితే వార్డు లో వ్యాధులు ప్రబలడం కాయం అని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే వర్షాలు పడే అవకాశాలు ఉండటంతో ఇంకా దుర్గంధంగా మారే అవకాశాలు లేకపోలేదు అంతేకాదు విషజ్వరాలు వచ్చి ఇప్పటికే చాలామంది ఇబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఉన్న లెనెట్టే… ఆయన వార్డు లో ఏ సమస్యను పట్టించుకోరు అని చెబుతుంటారు. ఇక అటుగా వెళ్లే వాహనాదారులకు కూడా తీవ్ర ఇబ్బందులు తలెతున్నాయి కలుగుతుంది. ఇప్పటికైనా శానిటరీ సిబ్బంది స్పందించి చెత్తను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.