నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఏ.పి రాష్ట్ర కన్వీనర్ జమీల్ అహ్మద్ బేగ్
గుంటూరు, అక్టోబర్ 18 : (అక్షర ప్రళయం)
రాజ్యసభ సభ్యురాలు, నేషనలిస్టు కాంగ్రెస్‌పార్టీ నేషనల్ ప్రెసిడెంట్, మహారాష్ట్ర డిప్యూటీ- సీఎం అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ జన్మదిన వేడుకలు గుంటూరు జిల్లా పెదకాకాని బాజీబాబా దర్గా వద్ద శుక్రవారం నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ జమీల్ అహ్మద్ బేగ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెదకాకాని బాజీబాబా దర్గా వద్ద సునేత్రా పవార్ ఆయురారోగ్యాలతో, అష్టఐశ్వర్యాలతో కలకాలం జీవించాలని పెద్దలతో కలసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పెద్దలకు, చిన్నారులకు స్వీట్లు- పంచిపెట్టారు. సునేత్రా పవార్ సేవలను కొనియాడుతూ ఆమె మరిన్ని పదవులను అధిరోహించాలని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ జమీల్ అహ్మద్ బేగ్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.