అనకాపల్లి అక్టోబర్ 19:(అక్షర ప్రళయం)
అనకాపల్లి జిల్లా పోలీసులు ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఐపిఎస్ బదిలీ సందర్భంగా అనకాపల్లి పట్టణం, పెంటకోట ఫంక్షన్ హాల్ నందు ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విజయనగరం జిల్లా ఎస్పీ గా పని చేస్తూ సాధారణ బదిలీల్లో భాగంగా జూలై 2024 అనకాపల్లి జిల్లాకు వచ్చి మూడు నెలలు వ్యవధిలో గంజాయి అక్రమ రవాణాపై దాడులు నిర్వహించడం, గంజాయి కేసుల్లోని తప్పించుకుని తిరుగుతున్న నిందితులను అరెస్టు చేయడం మరియు ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదు చేసి రోడ్డు ప్రమాదాలు నిలువరించారు. శాంతిభద్రతలు పరిరక్షించడంలో అధికారులకు, సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. ఇప్పుడు బదిలీపై కాకినాడ, 5వ బెటాలియన్ కు కమాండెంట్ గా వెళుతున్న సందర్భంగా జిల్లా అధికారులు ఎస్పీ ఎం.దీపిక ఐపీఎస్.,కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విధులు నిర్వహించడంలో తనకు జిల్లా అధికారులు, సిబ్బంది చక్కని సహాయ సహకారాలు అందించారని కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహన్ రావు, అనకాపల్లి ఇన్చార్జి డీఎస్పీ బి.అప్పారావు, పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ కె.వి.సత్యనారాయణ, నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ జి.ఆర్.ఆర్.మోహన్, విశాఖ నార్త్ జోన్ ఏసిపి ఎస్.అప్పలరాజు, ఏ.ఆర్ డీఎస్పీ పి.నాగేశ్వరరావు, ఏ.ఓ ఎ.రామ్ కుమార్ మరియు జిల్లా ఇన్స్పెక్టర్ లు మరియు ఎస్సైలు మరియు జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.