సాధారంగా పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువా వేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
విశాఖ దక్షిణం (అక్షర ప్రళయం)
సీతంపేట జనసేన పార్టీ నగర కార్యాలయంలో జనసేన విశాఖ నగర అధ్యక్షులు , దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో ఉమెన్స్ కాలేజీ ఎదురుగా గల నైట్ ఫుడ్ కోర్ట్ ప్రసిడెంట్ పోలవరపు నరసింగ్ ఆధ్వర్యంలో ఫుడ్ కోర్ట్ సభ్యులైన కె.సాయికుమార్,అరసాడాలక్ష్మి,ఏ.భారతి, చిన్న, వంశీ, రమేష్, రమణమ్మ, సత్యవతి, భవాని, చిన్నమ్మలు, నాయుడు, మురళి సురేష్ మొదలగు ఫుడ్ కోర్ట్ సభ్యులు సుమారు 150 మంది జనసేనపార్టీ లో జాయిన్ అయ్యారు, వీరందరికి ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ సాధారంగా పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువా వేశారు, అనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ పార్టీ మీద నమ్మకముతో జాయిన్ అయినా ఫుడ్ కోర్ట్ సభ్యులకు పార్టీలో సమూచిత స్థానం కల్పిస్తాను అని అన్నారు,ఫుడ్ కోర్ట్ ప్రసిడెంట్ నరసింగ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎంతో మంచివారని సహాయ గుణం కలవరని
అందరికి సేవ చేయాలని ఎల్లప్పుడు తపన పడే నాయకుడు మాకు మా నియోజకవర్గానికి దొరకడం మా అదృష్టం అని అన్నారు,ఈ కార్యక్రమంలో సౌత్ పాయింట్ అఫ్ కాంటాక్ట్ శివ ప్రసాద్ రెడ్డి, 27 వార్డ్ జనసేన అధ్యక్షులు సురేషబాబు (చంటి ), 34వ వార్డ్ ఇంచార్జి నారా నాగేశ్వరావు, 35వ వార్డ్ ఇంచార్జి శ్రీనివాస్, 42వ వార్డ్ ఇంచార్జి మర్రి వేముల శృనివాస్, భయన సునీల్, తేజ, అశోక్, శివ, తదితరులు పాల్గొన్నారు.