జనగామ (అక్షర ప్రళయం)
లంబడా లైవ్ ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ లావుడియా రాజు నాయక్ జీవో 29 తో ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం అని డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఈబీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సంతోష్ నాయక్ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు టాప్ మార్కులు వచ్చినా జనరల్‌గా కాకుండా, రిజర్వేషన్‌గా పరిగణించడం వల్ల మరో రిజర్వ్‌డ్ అభ్యర్థికి అవకాశం లేకుండా పోతోందని స్పష్టం చేశారు.యూపీఎస్సీ అమలు చేస్తున్నా.. ఆ విధానాన్ని టీజీపీఎస్సీ ఎందుకు అమ లు చేయడం లేదని నిలదీశారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు జీవో 55 ప్రకారం అన్నివర్గాల నిరుద్యోగులు, విద్యార్థులకు న్యాయం చేశారని పేర్కొన్నా రు.”రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పరిరక్షణ కోసం రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని సదస్సులు నిర్వహిస్తుంటే.. తెలంగాణలో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ వర్గానికి ప్రతినిధిగా ఉండి మౌనం వహిస్తున్నారు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు బలహీన వర్గాల హక్కులను కాపాడాలి.
విద్యార్థులు, నిరుద్యోగుల ఆర్తనాదాలతో అశోక్‌నగర్ ప్రాంతం మార్మోగుతోంది. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని, రిజర్వేషన్లు అమలు చేయాలని విద్యార్థులు రోడ్డెక్కితే వారిని కొడుతున్నారు. ఆడపిల్లల్ని కూడా అర్ధరాత్రి పోలీసు స్టేషన్లలో పెడుతున్నారు. వారేమైనా టెర్రరిస్టులు, హంతకులు, గూండాలా? లాఠీలు, అవి అణచేయవు. ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది.
కోదండరాం ఎందుకు మౌనంగా ఉంటున్నారు?
జీవో 29 రద్దు చేసి గ్రూప్స్ అభ్యర్థులకు విద్యార్థుల నాయ్యం చేయాలి, విద్యార్థుల జీవితాలతో చెలగాటం వద్దు. రాజకీయాలు పక్కనబెట్టి విద్యార్థుల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలని. లంబాడి లైవ్ ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ లావుడియా రాజు నాయక్ రాష్ట్ర ప్రభుత్వం ని డిమాండ్ చేశారు.