నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ జమీల్ అహ్మద్ బేగ్
విజయవాడ, అక్టోబర్ 21 : (అక్షర ప్రళయం)
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా దీపావళి నుంచి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నట్లు ప్రకటించడంపట్ల నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ జమీల్ అహ్మద్ బేగ్ హర్షం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగంగా పేదలకు ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామన్న హామీని అమలు చేయడం హర్షించదగ్గ విషయమని, అలాగే మచిలీపట్నం మెడికల్ కాలేజీకి పింగళి వెంకయ్య పేరు పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమని అన్నారు. అలాగే మహిళలకు ఉచిత ప్రయాణంపై కూడా నిర్ణయం తీసుకోవాలని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ జమీల్ అహ్మద్ బేగ్ కోరారు.