జల్ జీవన్ మిషన్ నిధులతో గ్రామీణ రక్షిత నీటి సరఫరాకు మంచి రోజులు.

ఇప్పటికే రూ.580 కోట్ల విడుదల… పనులు చేస్తే ఇంకా నిధులస్తా..

విశాఖ విజయనగరం (అక్షర ప్రళయం)

గుర్ల అతిసార పరిస్థితులపై విజయనగరం జిల్లా అధికారులతో రాస్గ్త్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం గ్రామీణ వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. పంచాయతీలకు నిధులు ఇవ్వడం కాదు కదా కనీసం రక్షిత తాగు నీరు కోసం శుద్ధి చేసే ఫిల్టర్ బెడ్లను కూడా మార్చలేదు. ఫలితంగా గ్రామీణ తాగునీటి సరఫరాలో లోపాలు తలెత్తి కలుషిత జలాలు సరఫరా అవుతు న్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వం మీద తప్పులు తోసేయాలని ఈ మాటలు చెప్పడం లేదని, రూ.600 కోట్లు వెచ్చించి రుషికొండ మీద రాజభవనం కట్టుకున్నారు తప్పితే, ఆ డబ్బుతో పేద ప్రజలకు మంచినీరు అందేలా ఫిల్టర్ బెడ్లను మార్చాలన్న ఆలోచన రాకపోయిందే అన్న ఆవేదనే నన్ను ఈ మాటలు మాట్లాడేలా చేస్తోందన్నారు. ఆ మొత్తంతో రక్షిత తాగు నీటికి నిర్వహణ పనులు చేసి ఉంటే ప్రజలకు ఆరోగ్యం దక్కేది అని చెప్పారు. గత ప్రభుత్వ పాలకులు చేసిన తప్పిదాలను సరిజేయడానికి తమ పాలనా సమయం సరిపోతోందని నిరాశను వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా, గుర్ల గ్రామంలో అతిసార ప్రభావంతో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ విజయనగరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘కూటమి ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలకు కట్టుబడి ఉంది. ప్రజల సమస్యల పట్ల పూర్తిస్థాయి బాధ్యతతో ఉంటుంది. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సరిదిద్దడానికే మాకు చాలా సమయం పడుతోంది. నా శాఖల బాధ్యతలు తీసుకున్న తరవాత గత ప్రభుత్వ హయాంలోని లెక్కలు చూస్తుంటే, నిధుల మళ్లింపు చూస్తుంటే గ్రామీణ పరిపాలన మీద ఇంత నిర్లక్ష్యం చేశారా అని బాధేస్తోంది. అధికారులు, సిబ్బందిని దేనిపై ప్రశ్నించినా గత ప్రభుత్వంలో నిధుల లేమి, నిర్లక్ష్యం, నిర్లిప్తతే సమాధానం అవుతోంది. పాలన విషయాల్లో మేం తప్పించుకోవాలని భావించడం లేదు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటాం.
• జల్ జీవన్ కు నిధులొచ్చాయి

గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు అందాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను పూర్తిగా దారి మళ్లించింది. రూపాయి కూడా పంచాయతీల ఖాతాల్లో జమ చేయలేదు. పంచాయతీల్లో నిధులు లేక నిర్వహణ లేక పలు పనులు మూలన పడ్డాయి.
కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ కింద ఈ నెల 18వ తేదీన రూ.580 కోట్ల నిధులు వచ్చాయి. ఆ నిధులను పూర్తిస్థాయిలో వినియోగిస్తే మరిన్ని నిధులు వచ్చేందుకు అవకాశం ఉంది. గ్రామాల్లో తాగునీటి వ్యవస్థను పూర్తిస్థాయిలో ఆధునికరించేందుకు జలజీవన్ మిషన్ నిధులను వినియోగించుకుంటాం.

మృతుల కుటుంబాలకు వ్యక్తిగతంగా రూ.లక్ష సాయం

గుర్ల ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ లో విచారణ చేయించాలని ఆదేశించారు. అతిసారానికి గల కారణాలు ఏమిటో పూర్తిస్థాయిలో నివేదిక ప్రకారం ప్రభుత్వం తరఫు నుంచి బాధితులకు తగిన పరిహారం అందిస్తాం. ప్రస్తుతం నా సొంత నిధుల నుంచి బాధిత పది మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పన అందిస్తాను. మృతుల పిల్లల విద్యకు తగిన భరోసా ఇస్తాం. మానవతా దృక్పథంతో ఈ నిధులు వారి కుటుంబానికి ఆసరాగా నిలుస్తాయని భావిస్తున్నాను. నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం కూడా తగిన విధంగా స్పందిస్తుంది. రాష్ట్రంలో ఉన్న పంచాయతీల్లో ముఖ్యంగా తాగునీటి అవసరాలకు సంబంధించి పనులపై దృష్టి పెడతాం. దీనికి ఒక పక్కా ప్రణాళికతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నిధులను తీసుకువచ్చేలా ప్రధాని నరేంద్ర మోడీ తో మాట్లాడుతాను. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత తాగునీటి వ్యవస్థకు జీవం పోస్తాం’’ అని చెప్పారు. సమావేశంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు కళా వెంకటరావు, శ్రీమతి లోకం నాగ మాధవి, శ్రీమతి అదితి గజపతిరాజు, శ్రీమతి కోళ్ల లలిత కుమారి, నిమ్మక జయకృష్ణ, బోనెల విజయ్ చంద్ర, ఈశ్వరరావు, జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *