సౌత్ ఇండియా మొత్తానికి ఏకైక వ్యక్తిగా ఎంపిక ..!
అనకాపల్లి (అక్షర ప్రళయం)
అనకాపల్లి జిల్లా ఎస్. రాయవరం మండలం సర్వసిద్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్లినిక్ క్లస్టర్ పర్యవేక్షకులు గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పి.ఎన్.వి.ఎస్.ప్రసాద్ ను ఎన్నో అవార్డులు వరించాయి అందులో మధర్ థెరిస్సా సేవ రత్న స్టేట్ అవార్డు, ఆంధ్ర రత్న స్టేట్ అవార్డు, డాక్టరేట్ అవార్డు అందుకొని ఇప్పుడు “భారత్ శ్రీ” జాతీయ అవార్డు కి ఎంపికవ్వటం ను పురస్కరించుకొని జిల్లా మలేరియా అధికారి కె.వరహాలు దొర మరియు జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి పి.జె.ఎం.అర్.పి.నాయుడు , సర్వసిద్ది పి.హెచ్.సి మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ ఎస్ ఎస్ వి శక్తి ప్రియ మరియు డాక్టర్ ఎన్ వాసంతి అలాగే ఇంతకు ముందు డాక్టర్ .పి.ఎన్.వి.ఎస్.ప్రసాద్ విధులు నిర్వహించిన శ్రీరాంపురం పి.హెచ్.సీ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ పి.కావ్య ,డాక్టర్ వై.తులసి నవీన సంయుక్తంగా అభినందనలు తెలిపారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని జాతీయ ,అంతర్జాతీయ ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు ద్వారా ప్రజలకు అర్థమయ్యేలా సులభ రీతిలో చెప్పి ప్రజల్ని చైతన్య వంతులగా చేయటానికి చేసిన కృషికి గుర్తింపుగా సౌత్ ఇండియా మొత్తానికి ఏకైక వ్యక్తి గా డాక్టర్. పి.ఎన్.వి.ఎస్.ప్రసాద్ ను భారత్ శ్రీ జాతీయ అవార్డు కు ఎంపిక చేసినట్లు, ఈ అవార్డు వచ్చే నెల 10 వ తేదీన న్యూ ఢిల్లీ లో కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా కాన్ఫరెన్స్ హాలులో ప్రదానం చేస్తామని హర్యానా కు చెందిన నేషనల్ హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ ఫౌండర్ గుంజన్ మెహతా తెలిపారు. అలాగే సర్వసిద్ది ,శ్రీరంపురం పి.హెచ్.సీ ఆరోగ్య విస్తరణ అధికారులు టి.నాగేశ్వరరావు,అర్.జె బాలాజీ సింగ్ ,హెల్త్ సూపర్వైజర్ లు ఎస్.ఎస్.వి.ప్రకాష్ , డి.సూర్యనారాయణ ,హెల్త్ విజిటర్ లు వై .సూర్యకుమారి , ఎస్.రాజ్య లక్ష్మి ,సీనియర్ అసిస్టెంట్ ప్రభాకర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, హెల్త్ సెక్రటరీ లు,ఇతర ఆసుపత్రి సిబ్బంది, ఇతర శాఖల అధికారులు,గ్రామ,మండల పెద్దలు,ఇతర నాయకులు అభినందనలు తెలిపారు.