(అక్షర ప్రళయం)
దేశంలో 2035 నాటికి భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉంటుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ తెలియజేసారు.
దానికి ‘భారతీయ అంతరిక్ష్ స్టేషన్’ అనే పేరు పెట్టనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ) మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. బయోటెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీలపై కలిసికట్టుగా పరిశోధనలు చేసేందుకు ఇస్రో, డీబీటీలు చేతులు కలపడాన్ని కీలక పరిణామంగా మంత్రి జితేంద్రసింగ్ అభివర్ణించారు.