(అక్షర ప్రళయం)
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమించారు. ఆయన 1983లో దిల్లీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2005లో దిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది, 2006లో అక్కడే శాశ్వత న్యాయమూర్తిగా నియమితుడయ్యారు. 2019లో జనవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. సీజేఐగా నవంబర్ 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.