గొప్ప మనసు చాటుకున్న వృద్ధురాలు

నకరికల్లు (అక్షర ప్రళయం)

గొప్ప మనసు చాటుకున్న వృద్ధురాలు నకరికల్లు మండలం కమ్మవారిపాలెంకు చెందిన నరిశెట్టి రాజమ్మ సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె గ్రామంలోని పలు సమస్యల గురించి సీఎంకు వివరించారు. తమ గ్రామంలో ఇళ్లు లేని వారు ఉన్నారని, వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. 15 మందికి ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తే, వాటికి తగిన భూమి ఇస్తానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా రాజమ్మను సీఎం అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *